ఖానాపూర్ టౌన్, మార్చి 30: ఖానాపూర్లో ఆది, బుధవారాల్లో నిర్వహించే వారసంతకు రైతులు పెద్ద ఎత్తున ఎండుమిర్చిని అమ్మకానికి తీసుకు వస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండడంతో రెట్టింపుగా ఎండు మిర్చి ఇక్కడికి వస్తున్నది. ఎండు మిర్చి ధర ప్రారంభంలో కిలోకు రూ. 250 నుంచి రూ. 300 ఉండగా పంట విపరీతంగా అమ్మకానికి రావడంతో ధర తగ్గిపోయింది. కిలో ఎండు మిర్చి రకాన్ని బట్టి రూ.200 నుంచి రూ. 220 వరకు మార్కెట్లో ధర పలుకుతుంది. ఖానాపూర్ వారసంతకు ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ఇక్కడికి ఎండు మిర్చి అమ్మకానికి రైతులు తీసుకు వస్తుంటారు. రైతులు పెద్ద సంఖ్యలో ఎండు మిర్చిని తీసుకురావడంతో కుప్పలు తెప్పలుగా కనిపించాయి.