కుమ్రం భీం ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
క్రీడాకారిణికి ఘన స్వాగతం
ఆసిఫాబాద్,మార్చి27 : వాంకిడి మండలంలోని మరుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ బిడ్డ కరీనాను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఆదివారం తన నివాసంలో క్రీడాకారిణి మడావి కరీనాను సత్కారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో జాతీయ జట్టు తరఫున పాల్గొని జిల్లాకే పేరు తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేశ్,నాయకులు శ్రీనివాస్,ప్రవీణ్‌గౌడ్ ఉన్నారు.
కరీనాకు ఘన స్వాగతం
అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ పోటీల్లో జాతీయ జట్టు తరపున పాల్గొని ప్రతిభ చూపిన మడావి కరీనాకు జిల్లాలోని విద్యార్థులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అటవీశాఖ చెక్‌పోస్ట్ నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధా న రహదారి గుండా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినులు చేసిన కర్రసాము అందరిని ఆకట్టుకుంది.
కాగజ్‌నగర్ రూరల్, మార్చి 27: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన క్రీడాకారిణి మడావి కరీనాకు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో స్థానిక నాయకులు, క్రీడాకారులు ఆదివారం ఘటన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు తుమ్మ రమేశ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్, బాలాజీ, రవీంద్రాచారి, పీటీ మధుసూదన్ పాల్గొన్నారు.