ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
పిప్పర్వాడ జడ్పీ పాఠశాలలో వార్షికోత్సవం
బండలనాగాపూర్, గిమ్మ గ్రామాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన
జైనథ్, మార్చి 27 : పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని పిప్పర్వాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ సర్కారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, వసతులు కల్పిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్‌రెడ్డి, హెచ్ఎం వీరేందర్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బండలనాగాపూర్లో విగ్రహ ప్రతిష్ఠాపన..
తాంసి, మార్చి 27 : మండలంలోని బండలనాగాపూర్ని శ్రీ సీతారామా లక్ష్మణ సమేత ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వేలాది మంది భక్తజనుల మధ్య విగ్రహాప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే శబరిమాత, మహాగణపతి, అన్నపూర్ణ సమేత శివ నందీశ్వర విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న-రమ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ సురుకుంటి మంజూలాశ్రీధర్రెడ్డి, సర్పంచ్ గంగుల వెంకన్న, మాజీ జడ్పీటీసీ పులి నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన..
జైనథ్, మార్చి 27 : మండలంలోని గిమ్మలో రేణుకా ఎల్లమ్మ విగ్రహప్రతిష్ఠాపన నిర్వహించారు. ఆలయంలో హోమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న-రమ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతీవెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్టినేటర్ ఎస్ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీటీసీ భోజన్న, సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు.