ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఎంపల్లి తండాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన
నార్నూర్, మార్చి 27 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ఎంపల్లి తండాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన, కలశ్ మహోత్సవాన్ని ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సందర్భంగా జడ్పీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో హోమం నిర్వహించి, హనుమాన్ విగ్రహం, కలశ్ ప్రతిష్ఠించారు. చైర్మన్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఉన్నతంగా చదువుకోవాలని సూచించారు. ఐక్యతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన చేసిందని, ఉద్యోగం సాధించేందుకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, సర్పంచ్ రాథోడ్ గోవింద్‌నాయక్, ఎంపీపీ తనయుడు కనక ప్రభాకర్, నారాయణ్, దేవిదాస్, హరిచంద్, రాములు నాయక్, సోహన్‌సింగ్, బాబులాల్, కైలాస్‌నాయక్, రాథోడ్ దయారామ్ మాహారాజ్, సకారామ్ మాహారాజ్, దశరథ్మాహారాజ్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.