ఎంపీపీ కల్యాణం లక్ష్మి
తలమడుగు మండల సర్వసభ్య సమావేశం
తలమడుగు, మార్చి 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీపీ కల్యాణం లక్ష్మి సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. గ్రామాల్లోని నెలకొన్న సమస్యలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎంపీపీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవట జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న మండల వైద్యాశాఖ అధికారి రాహుల్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి మాట్లాడూతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. వేసవికాలంలో గ్రామాల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, వైస్‌ఎంపీపీ దివ్య, ఎంపీవో దిలీప్, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.