రూ.29లక్షలు స్వాధీనం
ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం,మార్చి 26: ఏడీసీసీ బేల శాఖలో జరిగిన కుంభకోణంలో మరో ముగ్గురిపి అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్కార్టర్స్లో శనివారం వివరాలు వెల్లడించారు. ఏడీసీసీబీ బేల శాఖ నుంచి రూ.2.58 కోట్లు ఎలాంటి వోచర్లు లేకుండా స్వాహా చేసిన కేసులో శ్రీపతికుమార్ను ఇది వరకే పోలీసులు అరెస్టు చేశారు. శ్రీపతి కుమార్ తన కుటుంబ సభ్యుల బ్యాంకుల ఖాతాల నుంచి జన్నారం బ్రాంచ్ స్టాఫ్ అసిస్టెంట్ బండి రమేశ్ అకౌంట్లలోకి రూ.1,38,57,500 బదిలీ చేశాడు. అందులో నుంచి అతను పలుమార్లు కుమార్ ఖాతాకు రూ.40,03,000 తిరిగి పంపించాడు. మిగతా రూ.98,54,500 నుంచి రూ.46,63,000 బ్యాంకులో అతను జమ చేయించారు. బ్యాంకు అధికారులు రూ.5,89,000 బండి రమేశ్ ఖాతాను సీజ్ చేశారు. అతను దాదాపు రూ.17 లక్షలు అవసరాలకు వాడుకొని జల్సా చేశాడు. బండి రమేశ్ కోర్టుకు వెళ్లాడని ఆదిలాబాద్ బస్టాండ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతడిని పట్టుకున్నారు. రమేశ్ నుంచి రూ.29లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బేల బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ వై రానిత, స్టాఫ్ అసిస్టెంట్ రాహుల్ తమ విధుల్లో నిర్లక్ష్యం, ప్రమాణికరణ దుర్వినియోగం చేసినందుకు వారిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, జైనథ్ సీఐ కోల నరేశ్ కుమార్, ఎస్ఐ పాల్గొన్నారు.