వివరాలు వెల్లడించిన నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి
నిర్మల్ అర్బన్, మార్చి 26 : పెళ్లి బరాత్‌లో డీజే సౌండ్ విషయంలో జరిగిన గొడవలో ఒక రి మృతికి కారణమైన ఏడుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 23న దిలావర్పూర్ మండలంలోని కా ల్వ తండాలో ఇద్దరి యువకుల పెళ్లి జరిగింది. సాయికుమార్ పెళ్లి నరసింహనగర్ తండా నస్పూర్‌లో జరుగగా, మెగావత్ రాజు వి వాహం నగర్తండాలో జరిగింది. అదేరోజు రాత్రి కాల్వ తండాలోని జగదాంబ మంది రం నుంచి పోలీసుల అనుమతులు లేకుండా ఇద్దరు డీజేలను పెట్టుకున్నారు. ఇరు కుటుంబాలకు గతంలో భూ గొడవలు ఉండడంతో ఇద్దరి మధ్య మాటలు లేవు. మెగావత్ రాజు బరాత్‌లో చేసిన డ్యాన్సు కంటే మన బరాత్ లో మంచిగా డ్యాన్స్ చేయాలని సాయి కుమా ర్ అతని స్నేహితులకు మద్యం తాగామని డ బ్బులు ఇచ్చాడు. దీంతో సాయి కుమార్ స్నే హితులు బాగా మద్యం తాగి వచ్చారు.
ఈ క్రమంలో మెగావత్ రాజు బంధువైన మెగావత్ నవీన్ సాయికుమార్ బరాత్ వద్దకు వెళ్లి డీజే సౌండ్ తగ్గించుమని సాయికుమార్‌ను కోరగా ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. దీం తో సాయికుమార్ స్నేహితులను రెచ్చగొట్టగా అంతలోనే సాయికుమార్ స్నేహితులు పడిగెల భూమేశ్, చినిట్ల దిలీప్, తుమ్మ సాయికుమా ర్, గాందారి రాకేశ్, చాకపురం లక్ష్మణ్, నూక మహేశ్ మెగావత్ నవీన్‌ను చేతులతో బలంగా కొట్టగా కిందపడిపోయాడు. చంపాలనే ఉద్దేశంతో కాళ్లతో అతని చాతీలో తన్నుతూ తొక్క గా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని సర్కారు దవాఖానకు తీసుకెళ్లగా మృతి చెందాడు. నవీన్ మరణానికి కారణమైన నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ వెంకటేశ్, తదితరులు ఉన్నారు.