ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
అధికారులతో సమీక్ష
ఎదులాపురం, మార్చి 26 : జిల్లాలో దళితబందు పథకం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో దళితబంధు పథకం అమలుపై సంబంధిత శా ఖల అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఎంచుకున్న యూనిట్లపై వారికి అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎంపికైన 253 మం దిలో మొదటి దశలో భాగంగా 63 మంది లబ్ధిదారులకు గొర్రెలు, మేకలు, షెడ్ల వంటి యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గాల వారికి నియమించిన ప్రత్యేకాధికారులు యూనిట్ల స్థాపనకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, త్వరగా గ్రౌండింగ్కు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామాల వారీగా అందించనున్న యూనిట్లపై చర్చించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జడ్పీ సీఈవో కిషన్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రంగారావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పద్మభూషణ్ రాజు, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్ , జడ్పీ అదనపు సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎల్డీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు.