ఈ నెల 31 వరకు కార్యక్రమాలు
మోదీ సర్కారు వైఖరికి నిరసనగా తీర్మానాలు చేసిన పంచాయతీలు
బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్న సర్పంచ్‌లు
నేడు ఎంపీపీ, ఎంపీటీసీల తీర్మానం
వడ్లు కొనాల్సిందే.. లేకుంటే పుట్టగతులుండవని హెచ్చరిస్తున్న రైతులు
నిర్మల్‌లో మంత్రి అల్లోలకు తీర్మానం ప్రతులు అందజేత
కోటపల్లి/నెన్నెల/చెన్నూర్ రూరల్/కాసిపేట/కౌటాల/సోన్, మార్చి 25 : తెలంగాణ రైతులంటేనే చిన్నచూపు చూస్తున్న కేంద్ర సర్కారుపై టీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. నిన్నమొన్నటిదాకా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన గులాబీదండు.. మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నది. ‘వన్‌నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్’ పేరిట ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతటా ఒకే పాలసీ ఉండాలన్న నినాదంతో గ్రామ స్థాయి నుంచే దండయాత్ర మొదలుపెడుతున్నది. ధాన్యం కొనాల్సిందేనంటూ ఉమ్మడి జిల్లాలో పలు జీపీలు శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం చేయగా, నేటి నుంచి సహకార సంఘాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తుల్లోనూ కాపీలను గంపగుత్తగా నరేంద్ర మోదీకి ఇండియన్ పోస్టు ద్వారా పంపేందుకు సిద్ధమవుతున్నది. ఇదిలా ఉంటే ప్రజలు, రైతులను అవమానించేలా నూకలు తినాలని పీయూష్‌గోయల్ మాట్లాడడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ఇక తగ్గేదే లేదని.. తాడోపేడో తేల్చుకునుడే అంటూ స్పష్టం చేస్తున్నది.
ధాన్యం కొనుగోలు కోసం మరో పోరాటం మొదలైంది. కేంద్రం వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో ఉధృతమవుతున్నది. దశలవారీగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమానికి శ్రీకా రం చుట్టాలని, ఇదే సమయంలో ప్రజలు, రైతులకు వాస్తవాలు తెలియజేయాలని సీఎం ఆదేశించగా, వారం రోజులపాటు కార్యక్రమా లు చేపట్టేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగా ఈ నెల 24 నుంచి 31 వరకు ఏ రోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో ఇప్పటికే పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు గురువారమే (ఈ నెల 24న) అన్ని అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పార్టీ సన్నాహక సమావేశాలు విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే రైతు ఉద్యమానికి సిద్ధం కావాల ని, తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, రైతుల ఇండ్లపై నల్లజెండా ఎగురవేయాలని, రైతులనూ జాగృతం చేసి భాగస్వాములను చే యాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తీర్మానాల ఉద్యమం షురూ..
రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతోపాటు కండ్ల ముందు కేంద్రం పెడుతున్న కొర్రీలు.. తద్వా రా ఏర్పడబోయే ఇబ్బందులవంటి అంశాల ను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీలతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తె లంగాణలో పండిన ధాన్యాన్ని బరాబర్ కొనాలంటూ.. సీఎం కేసీఆర్ కేంద్రం ముందు పె ట్టిన డిమాండ్‌కు పూర్తి మద్దతు పలుకుతున్నా రు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పల్లెలన్నీ కలి సికట్టుగా కదిలాయి. వందం శాతం ధాన్యం కొనసాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించా యి. సీఎం ఆదేశాలను పరిగణనలోకి తీసుకు న్న పంచాయతీ పాలకవర్గాలు.. శుక్రవారం ఉదయం నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చు ట్టాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మెజార్టీ చోట్ల పాలకవర్గాలు సమావేశమయ్యాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఘన్పూర్, మై లారం, గొల్లపల్లి, కొత్తూర్, ఆవడం, చిత్తాపూ ర్, కాసిపేటలో లంబాడీతండా(కే), కోటపల్లి, మల్లంపేట, చెన్నూర్ మండలం కొమ్మెర, పొ క్కూర్, ఆస్నాద్, ఎర్రగుంటపల్లి, నాగాపూర్, సంకారం, ఓత్కులపల్లి, కత్తరశాల, సుందరశాల, దుగ్నెపల్లి, సోమన్‌పల్లి, ముత్తరావుపల్లి, చెల్లియిపేట, అక్కెపల్లి గ్రామా ల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని అన్ని జీపీల్లో తీర్మానాలు చేశారు.
31 వరకు ప్రక్రియ
ఈ నెల 24న సన్నాహక సమావేశాలు నిర్వహించగా, 25న పంచాయతీ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. ఇవేగాకుండా ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. 26న ఎంపీపీలు, ఎంపీటీసీలు కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలకు నిరసనగా తీర్మానాలు చేయనున్నారు. 27న జిల్లా, మం డల స్థాయి రైతుబంధు సమితి కమిటీలు, 28న మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలు, 29న డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లు, డైరెక్టర్లు, 30న జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, 31న మున్సిపల్ చైర్మ న్లు, వార్డు కౌన్సిలర్లు తీర్మాణాలు చేయనున్నారు. తీర్మా న ప్రతులను ఒకేసారి మోదీకి చేరేలా కొరియర్ లేదా, పోస్టు ద్వారా పంపించనున్నారు.
మంత్రి అల్లోలకు తీర్మానం ప్రతులు
సోన్, మార్చి 25 : యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్మల్, సోన్ మండలం సాకెర, కడ్తాల్, గంజాల్, న్యూవెల్మల్, బొప్పారం, పాక్పట్ల, మాదాపూర్, కూచన్‌పెల్లి, సంగంపేట్, అక్కాపూర్, డ్యాంగాపూర్, చిట్యాల్, నీలాయిపేట్, మేడిపెల్లి తదితర గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన తీర్మా నం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మానం చేసి ఆ ప్రతులను నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అందించారు.