సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
బండలనాగాపూర్లో రామాలయం, రైతు వేదిక ప్రారంభం
తాంసి, మార్చి 25 : రాష్ట్రంలోని ఆలయాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తాంసి మండలంలోని బండలనాగాపూర్లో నూతనంగా నిర్మించిన రామాలయం, రైతు వేదిక భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు మంత్రికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలు అభివృద్ధకి నోచుకోలేదని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధి ఎంతగానో జరుగుతుందన్నారు. బోథ్ నియోజకవర్గంలో 28 ఆలయాలకు దాదాపు రూ.40కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
అలాగే రైతు వేదికల ద్వారా రైతులు ఒకచోట చేరి సభలు, సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించి, రైతులకు అవసమైన సలహాలు, సూచనలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అంతకుముందు బోథ్ ఎమ్మెల్యే బాపురావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రి, ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ సురుకుంటి మంజూలాశ్రీధర్రెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో రవీందర్, సర్పంచ్ గంగుల వెంకన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, రైతు బందు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్దన్‌రెడ్డి, సర్పంచులు సదానందం, కేషవ్రెడ్డి, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు రాంరెడ్డి, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నిర్మల్‌లో పోలీస్ కమ్యూనిటీ హాల్‌కు భూమి పూజ..
నిర్మల్ అర్బన్, మార్చి 25 : నిర్మల్ పట్టణంలోని బత్తీస్ గడ్ ప్రాంతంలో మినరల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.48లక్షలతో పోలీస్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ నిధుల నుంచి మరో రూ.కోటితో నిర్మాణం చేపడుతామన్నారు. ఈ భవనంలో పోలీసులతో పాటు ఇతరులు కూడా ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చిన ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌ను మంత్రి అభినందించారు. అనంతరం భవన నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీ ణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ నల్లూరి పోశెట్టి, ఏఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీలు ఉపేంద ర్ రెడ్డి, జీవన్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాం నర్సింహా రెడ్డి, స్పెషల్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
లక్ష్మణచాందలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన..
లక్ష్మణచాంద, మార్చి 25 : మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించిన శుక్రవారం అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంతి అల్లోల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తే, కేంద్రం తెలంగాణ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. మండల కేంద్రంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు.
స్థానిక నాయకులు ముందుకు వచ్చి రోడ్డు వెడల్పునకు సహకరించాలని సూచించారు. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారు ఇల్లు నిర్మించుకుంటే రూ.3 లక్షల సాయం గానీ, డబుల్ బెడ్రూం ఇల్లు గానీ అందజేస్తామన్నారు. లక్ష్మణచాందలోని శ్రీరాముల వారి ఆలయానికి రూ.50 లక్షలు, బ్రహ్మంగారి ఆలయానికి రూ.30 లక్షల నిధులు అందజేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, నాయకులు ఈటల శ్రీనివాస్, జహీరొద్దీన్, సాతం గంగారాం తదితరులు పాల్గొన్నారు.