కౌటాల, మార్చి 25 : ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మండలంలోని తుమ్డిహట్టి గ్రామ సరిహద్దులోని ప్రాణహిత పుష్కర ఘాట్‌ను వారు శుక్రవారం పరిశీలించారు. వచ్చే నెలలో 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నందున పుష్కర ఘట్ వద్ద గల వసతులు, చేయాల్సిన అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ప్రస్తుతం రూ.40 లక్షల నిధులతో గ్రామంలోని హనుమాన్ మందిర్ నుంచి ప్రాణహిత పుష్కర ఘాట్ వరకు వేస్తున్న సిమెంట్ రోడ్డు పనులను వారు పరిశీలించారు. అనంతరం ప్రాణహిత నదిలోని నీటి లభ్యత, ఘాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, తహసీల్దార్ రాంలాల్, ఎంపీడీవో అబ్దుల్ నస్రుల్లాఖాన్, ఎంపీవో శ్రీధర్ రాజు, ఎంఆర్ఐ దేవేందర్, ఏపీవో పూర్ణిమ, పీఆర్ఏఈ ఆత్మారాం, సర్పంచ్ చరణ్‌దాస్, మొగడ్‌ధగడ్ ఎంపీటీసీ మనిశ్తో, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్లపాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ కార్యకర్తలున్నారు..
లంబాడీహెట్టిలో రోడ్ల పరిశీలన
చింతలమానేపల్లి , మార్చి 25 : మండలంలోని లంబాడీహెట్టి గ్రామంలో శుక్రవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ రైతులు తమ తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు తగరు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లంబాడీహెట్టి నుంచి గుప్పగూడెం మీదుగా పల్లె ప్రకృతివనం వరకు మూడున్నర కిలోమీటర్లు, బాలాజీ అన్కోడా నుంచి కేస్లాపూర్ వరకు మూడు కిలో మీటర్లు, దిందా గ్రామం నుంచి పంట పొలాల్లోకి వెళ్లేందుకు 6 కిలోమీటర్ల మొరం ద్వారా రోడ్డు వేశామన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని రైతులు పంట పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా తగర్ రోడ్లు నిర్మించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌కు వివరించారు. ఆయన వెం ట ఎంపీపీ డుబ్బుల నానయ్య, కోఆప్షన్ సభ్యులు నా జీం హుస్సేన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డు బ్బుల వెంకయ్య, ఎంకపీటీసీ ధన్‌రాజ్, నాయకులు మారుతి, శ్రీనివాస్, వసంత్, రూప్‌లాల్, కమరేశ్, మాధవ్, రాజన్న, సుధాకర్, గ్రామస్తులు ఉన్నారు.