ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
భోరజ్ చెక్‌పోస్టు వద్ద రోడ్డు పనుల పరిశీలన
జైనథ్, మార్చి 23 : యువత రక్తదానంలో ముందుండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. టీఆర్ఎస్ నాయకుడు ప్ర భాకర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని నిరాలలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. అన్ని ధానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. కులమతాలను చూడనిది రక్తదానం ఒక్కటేనన్నారు. అపోహలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారందరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునంద, 60 మంది యువకులు రక్తదానం చేశారు.
రోడ్డు పనుల పరిశీలన..
జాతీయ రహాదారి 44 భోరజ్ చెక్‌పోస్టు సమీపంలో నిర్మిస్తున్న స్లీపింగ్రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడి మూలమలుపు వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతుండేవని తెలిపారు. వాటి నియంత్రణకు పక్క నుంచి హైవేపైకి ఎక్కేందుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, నాయకులు చంద్రయ్య, ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు.
వేంకటేశ్వరాలయంలో పూజలు..
భీంపూర్, మార్చి 23 : భీంపూర్ మండలం ధనోరా శ్రీ వేంకటేశ్వరాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాల గురించి, రాష్ట్రం పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తర్వాత బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ బక్కి అజయ్‌యాదవ్‌తో గ్రామప్రగతి గురించి చర్చించారు. వివిధ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.