సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే
పిప్పర్వాడలో న్యాయవిజ్ఞాన సదస్సు
జైనథ్, మార్చి 22 : పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సీనియర్ సివిల్‌జడ్జి క్షమాదేశ్‌పాండే సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మండలంలోని పిప్పర్వాడలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే చట్టాలు, న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని వివాదాలకూ రాజీయే రాజమార్గమని పేర్కొన్నారు. సున్నితంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి సునీత మాట్లాడుతూ.. నిత్యం జరిగే వివాదాలు, వాటికి పరిష్కార మార్గాలు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వెండి బద్రేశ్వర్‌రావు, ఎస్ఐ బిట్ల పెర్సిస్, సర్పంచ్ నోముల సంతోష్‌రెడ్డి, హెచ్ఎం వీరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.