ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్
ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం
బోథ్, మార్చి 22 : నీటిని పొదుపుగా వాడితేనే భావితరాలకు భవిష్యత్ ఉంటుందని బోథ్ సబ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్ పేర్కొన్నారు. మండలంలోని కన్గుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మనీషా, స్పందన(ప్రథమ), గంగాభవాని (ద్వితీయ), నికిత, రంజిత్ తృతీయ స్థానాలు సాధించారు. వారికి ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోశెట్టి, ఎస్ఎంసీ చైర్మన్ ఆశన్న, ఉపాధ్యాయులు రాకేశ్, సుదర్శన్‌గౌడ్, సునీల్, సీతారాం, రవికిరణ్, టీఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, రవియాదవ్, దేవీదాస్, నరేందర్ పాల్గొన్నారు.
జల సంరక్షణతోనే మనుగడ
ఉట్నూర్ రూరల్, మార్చి 22: జల సంరక్షణతోనే మానవ మనుగడ అని సీపీఎఫ్ ప్రాజెక్టు అధికారి ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మండలంలోని చెరువుగూడ గ్రామంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాసుబాయి మాట్లాడుతూ మనిషికి ప్రాణాధారమైన నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది రాజేందర్, తిరుమలేశ్, సీఎఫ్ఎఫ్లు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
తలమడుగు, మార్చి 22 : మండలంలోని సుంకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ తీశారు. పాఠశాల ఆవరణలో సేవ్ వాటర్ ఆకృతిలో మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్, ప్రధానోపాధ్యాయురాలు సులోచన, బాల వికాస్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.