ఇంద్రవెల్లి ఎంపీపీ శోభాబాయి
శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఇంద్రవెల్లి, మార్చి 22: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రె పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్ సహకారంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీటీసీ పుష్పలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మార్కెట్ యార్డుకు నాణ్యమైన పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జిలానీ బేగ్, వైస్‌ఎంపీపీ గోపాల్‌సింగ్, ఎంపీటీసీ మడావి భీంరావ్, నాయకులు మారుతి, రాంనివాస్, పీఏసీఎస్ అధికారులు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
నార్నూర్, మార్చి 22 : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్లో మార్క్‌ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనగ క్వింటాల్‌కు రూ.5,230 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మొట్టమొదటిసారిగా శనగ పంట విక్రయించిన రైతును శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నాగోరావ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ సురేశ్, సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, ఎంపీటీసీ పరమేశ్వర్, డైరెక్టర్ కాంతారావ్, నాయకులు కనక ప్రభాకర్, చంద్రశేఖర్, రాథోడ్ ఉత్తమ్ పాల్గొన్నారు.
బోథ్‌లో…
బోథ్, మార్చి 22 : బోథ్ మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్క్‌ఫెడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5230 చెల్లిస్తున్నారు. ఎకరానికి 6.70 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన క్లస్టర్ గ్రామాల వారీగా రైతులు శనగలను అమ్మకానికి తీసుకురావాలని కేంద్రం ఇన్చార్జి, నేరడిగొండ పీఏసీఎస్ సీఈవో భూషణ్ తెలిపారు.