ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,మార్చి21: ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడారు. తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి, మిగతావి ఉన్నతాధికారులకు నివేదిస్తా మని తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
పరిహారం అందేలా చూడాలని వినతి
ఫసల్ భీమాలో ప్రీమియం చెల్లించిన ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీసీబీ డైరెక్టర్ బాలురి గోవర్ధన్ రెడ్డి కోరారు. రైతుబంధు సమితి జైనథ్ మండలం నాయకుడు లింగారెడ్డి, పలువురు రైతులతో కలిసి కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రాలు అందజేశారు. రైతుల సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. జిల్లాలో సుమా రు 4 వేల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో ఫసల్ బీమా ప్రీమియం చెల్లించారని పేర్కొన్నా రు. వారికి ఇప్పటి దాకా పరిహారం అందలేదన్నా రు. 2018-19 సంవత్సరానికి సంబంధించి వర్షాధారిత పంటల బీమా పరిహారం సైతం అందలేదని వివరించారు. వారం రోజుల్లో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రచార కార్యక్రమాలు విస్తృతం చేయాలి
ఎదులాపురం, మార్చి 21: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మారుమూల గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన సంక్షేమ స్వరాలు పుస్తకం, క్యాలెండర్, డైరీలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో గిరిజన, ఇతర ప్రాంతాల్లో గోండి ,మరాఠి, తెలుగు భాషల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డీపీఆర్వో ఎస్ భీమ్ కుమార్, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టులకు శిక్షణ
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ నెల 26,27 తేదీల్లో షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు తరగుతు ప్రారంభమవుతాయనివివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దళిత బంధు, ఎస్సీ సబ్ ప్లాన్, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిక్షణ తరగుతులను జిల్లాలోని ఎస్సీ జర్నలిస్టులందరూ వినియోగించుకోవాని కలెక్టర్ కోరారు.