ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసి రైతు లు, ప్రజలు నష్టపోయారని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సా ధారణ వర్షపాతం కంటే 150 శాతం అధికంగా నమోదైందన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 1.27 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్రానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ జీవో నంబర్ 2 ప్రకారం అధిక వ ర్షం పడితే కేంద్ర బృందాలను పంపించి, నివేదికల ఆధారంగా ఆర్థిక సాయం అందించాలని గు ర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ నాయకుల కు ఇవేమీ పట్టడంలేదని విమర్శించారు.
వర్షాల తో నష్టపోయిన వారిని కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారని, మోదీని ఒప్పించి ప్రత్యేక బృందాలను రప్పించాలని డి మాండ్ చేశారు. ఇక్కడ పరిస్థితిని వివరించి, జా తీయ విపత్తుగా ప్రకటించేందుకు కృషి చేయాల ని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు. కానీ, కేంద్ర ప్ర భుత్వం తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతుం దో రాష్ట్ర బీజేపీ నాయకులే చెప్పాలని ప్రశ్నించా రు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు తమ అధినాయకత్వంతో మాట్లాడి, రాష్ట్ర ప్రజలకు న్యా యం చేయాలన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, లింగారెడ్డి, సెవ్వ జగదీశ్, నారాయణ, మార్సెట్టి గోవర్ధన్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.