తాంసి, జూలై 17 : గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజూ నిర్వహించాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య జీపీ కార్యదర్శులకు సూచించారు. ఆదివారం మండలంలోని గిరిగాం, అంబుగాం, అట్నంగూడలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా నాలాలు శుభ్రం చేసి తాగునీటిలో బ్లీచింగ్ వేయాలన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ రాజు, పంచాయతీ కార్యదర్శి గంగన్న, సర్పంచులు గజానన్, శంభు, యశ్వంత్, ఉప సర్పంచ్ ఇంద్రదేవ్, టీఆర్ఎస్ నాయకులు తులసీరాం, ఉత్తమ్, గంగారాం, ఆత్మరాం, కిషన్, శివదాస్ తదితరులున్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, జూలై 17: మండలంలోని అర్లి(టి), అంతర్గాం, కరంజి(టి), కామట్‌వాడ, అందర్‌బంద్, భీంపూర్ పంచాయతీల్లో ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. డ్రెయినేజీల్లో మట్టి, చెత్తను తొలగించారు. బావులు, ట్యాంకుల్లో క్లోరినేషన్ చేశారు. సర్పంచులు జి. రమాబాయి, జి.స్వాతిక, తాటిపెల్లి లావణ్య, పెండెపు కృష్ణాయాదవ్, మడావి లింబాజీ పనులను పర్యవేక్షించారు.
ముందస్తు చర్యలు…
నార్నూర్, జూలై 17: మండలంలోని సావ్రి పంచాయతీతో పాటు ఝరి గ్రామంలో ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జీపీ కార్యదర్శి సునీల్‌కుమార్ చెప్పారు.
తాడి హత్నూర్‌లో..
నార్నూర్, జూలై 17: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుధ్య పనులు చేపట్టామని సర్పంచ్ రాథోడ్ మధుకర్ అన్నారు. ఆదివారం మండలంలోని తాడిహత్నూర్ పంచాయతీలో పారిశుధ్య పనులు చేపట్టారు. తాగునీటి బావుల్లో కోర్లినేషన్, అపరిశుభ్రత ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు.