పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నిర్మల్ చైన్‌గేట్, జూలై 17 : ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈగలు, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల ని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసు కోవాలని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, అధికారులు ఉన్నారు. శాంతినగర్ వడ్డెర సంఘం భవనంలో రాంనగర్ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యం లో వైద్య శిబిరం నిర్వహించారు. నాగేశ్వర్రావు, సూపర్వైజర్ మతిన్, సీవో రమణ, ఫార్మాసిస్టు సురేఖ తదితరులు ఉన్నారు.
పలుచోట్ల వైద్య శిబిరాలు
ఖానాపూర్ టౌన్, జూలై 17 : మున్సిపాలిటీ లోని శాంతినగర్, ఇంద్రానగర్, పద్మావతీనగర్ లో ఆయా వార్డుల కౌన్సిలర్లు, చైర్మన్ ఆధ్వర్యం లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పెంబి పీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో 751 మందికి ఉచితంగా మందులు అందజేశారు. పలువురికి వైద్య పరీక్షలు చేశారు. 22 మందికి మలేరియా, ఏడుగురికి డయేరియా ఉన్నట్లు గుర్తించారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, కౌన్సిలర్లు సంతోష్, కిశోర్ నాయక్, హెచ్ఈ జయలలిత, నాగరాజు ఉన్నారు.
తర్లపాడులో ..
ఖానాపూర్ రూరల్, జూలై 17: తర్లపాడులో పెంబి పీహెచ్సీ అధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. 42 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సర్పంచ్ పెద్ది గోదావరి, ఏఎన్ఎం స్వాతి, నాయ కులు పెద్ధి నర్సయ్య, రామిడి మహేశ్, గోపు రత్నం, బీ నగేశ్, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, సుకన్య గ్రామస్తులు పాల్గొన్నారు.
భూత్కూర్‌లో..
దస్తురాబాద్, జూలై 17 : భూత్కూర్‌లో పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యురాలు కిరణ్మయి పలువురికి పరీక్షలు చేసి మందులు అందజేశారు. మున్యాల లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్ దుర్గం శంకర్ ప్రారంభించారు. పలువురికి మం దులు పంపిణీ చేశారు. హెచ్వీ లలిత, ఏఎన్ఎం రాజేశ్వరి, పద్మాలదేవి,హెల్త్ అసిస్టెంట్ రవి, ఆశ కార్యకర్తలు లక్ష్మి, గోదావరి పాల్గొన్నారు.
దౌనెల్లిలో..
కుంటాల, జూలై 17 : మండలంలోని దౌనెల్లి తండాలో కుంటాల పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 63 మందిని పరీక్షించి అవసర మయ్యే మందులను అందజేశారు. 12 మంది జ్వర పీడితుల రక్తనమునాలను సేకరించా రు. ఏఎన్ఎం సక్కుబాయి, గ్రామస్తులు ఉన్నారు.
భైంసాలో..
భైంసా, జూలై 17 : పట్టణంలోని రాహుల్ నగర్, ఓవైసీ నగర్లో ఆదివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు పరిసరాల శుభ్రత పాటిం చాలని కోరారు. పలువురికి వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ మతీన్, హెల్త్ సూపర్వైజర్ ఖలీం, ఏఎన్ ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యూపోచంపాడ్లో..
సోన్, జూలై 17 : నిర్మల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ భూమేశ్, డాక్ట ర్ వెంకటేశ్వర్, ఆరోగ్య పర్యవేక్షకుడు ఏ సంతో ష్, ఆరోగ్య సహాయకులు రాజమణి, శ్యామల, సాయినాథ్, ఆశ కార్యకర్త సాగరిక పాల్గొన్నారు.
మాలేగాంవ్లో..
కుభీర్, జూలై 17 : మాలేగాంవ్ గ్రామంలో సీజనల్ వ్యాధులపై డాక్టర్ నరేశ్, ఫిర్దోష్ జమీల్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంత రం జీపీలో వైద్య పరీక్షలు చేసి మందులు అంద జేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహిపాల్‌రెడ్డి, పీహెచ్సీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎం మంజుల, వీడీసీ అధ్యక్షుడు శేల్కే ఆనంద్, ఆశ వర్కర్ రాధ, వీరేందర్, సాగర్ ఉన్నారు.
జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురి శాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వ్యాధుల ప్రబలకుండా సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పల్లె పల్లెనా, పట్టణాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నది. వైద్యా ధికారులు, సిబ్బంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులను పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.