నేటి విద్యార్థులే భవిష్యత్ ఓటర్లు
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
జడ్పీహాలులో జిల్లాస్థాయి పోటీలు
ఎదులాపురం, మార్చి 16 : ప్రజాస్వామ్యం లో ఓటే కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ‘చునావ్ పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ప్రతి విద్యార్థి ఓటుహక్కు, పోలింగ్, ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేటి విద్యార్థులే భవిష్యత్ ఓటర్లన్నారు. ప్రజాస్వామ్యం లో ఎన్నికల ప్రక్రియ అతి పెద్దదని, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేల మంది అధికారు లు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పనిచేస్తారని చెప్పారు. చివరకి ప్రజల భాగస్వామ్యంతోనే ఎన్నిక ప్రక్రియ విజయవంతం అవుతుందన్నారు. మాక్ పోలింగ్, ఎన్నికల ప్రక్రియపై వ్యాస రచన, క్విజ్పై జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు బహుమతులు, నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక అందజేశారు.
మాక్ పో లింగ్లో కూర విద్యార్థులకు మొదటి బహుమతి, రణదివేనగర్ విద్యార్థులకు రెండో బహుమతి ద క్కింది. వ్యాస రచన పోటీల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.దివ్య, సాంగిడి విద్యార్థికి మొ దటి బహుమతి, దేవాపూర్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎస్.లక్ష్మికి రెండో బహుమతి అందజేశారు. క్విజ్ పోటీల్లో బి.ప్రీతి, దీపాయిగూ డ విద్యార్థికి మొదటి బహుమతి, శ్లేష, సిరికొండ పాఠశాల విద్యార్థికి రెండో బహుమతి దక్కింది. ఎన్నికల సరళిపై నిర్వహించిన పోటీల్లో బరంపూర్ విద్యార్థికి తేజశ్విని, సొనాల పాఠశాలలకు చెందిన రామకృష్ణకు రెండో బహుమతి దక్కింది. వీరికి జ్ఞాపికతో పాటు నగదు పురస్కారాలను కలెక్టర్ అందజేశారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలతో పాటు షీల్డ్లు బహూకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, డీఈవో ప్రణీత, డీపీవో ఎన్.భీమ్కుమార్, ఆల్ ఇండియా రేడియా ప్రోగ్రాం ఇన్చార్జి కే రామేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాణ్యమైన బోధన అందించాలి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు శుభ్రమైన ఆహారాన్ని అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. స్థానిక గిరిజన సంక్షేమ శాఖ పాఠశాల, కళాశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతుల వారీ గా విద్యాబోధన, భోజనం, వసతిగృహంలో కల్పిస్తున్న మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని వంట గది, స్టాక్ రూంను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందించాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
రోజువారీగా విద్యార్థుల హాజరు, అందిస్తున్న మెనూపై ఆరాతీశారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. పదోతరగతి విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సామర్థ్యాలను తెలుసుకున్నారు. సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ అగస్టీన్, ఉపాధ్యాయులున్నారు.