ఇంద్రవెల్లి, మార్చి16 : సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతు న్నాయని ఎంపీపీ పోటే శోభాబాయి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సూఫీయాన్, ఫీల్డ్ అసిస్టెంట్లు కోరెంగా సుంగు పటేల్, జాదవ్ ఆనంద్‌రావ్, నజీర్, విఠల్, చందు, సంతోష్, లఖన్సింగ్, భీంరావ్, జంగు, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
భీంపూర్, మార్చి 16 : సీఎం కేసీఆర్ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించటంతో మండలంలోని 26 పంచాయతీల్లో సంబురాలు చేసుకున్నారు. భీంపూర్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎఫ్ఏల సంఘం మండల అధ్యక్షుడు మాద విఠల్, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, నాయకులు జీ నరేందర్ యాదవ్ , బక్కి కపిల్యాదవ్, ఎఫ్‌ఏలు గజానన్, అశోక్ ఉన్నారు.
బేల, మార్చి16 : స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్అసిస్టెంట్లు సోనేరావు, అతుల్, గణేశ్, షాహిద్ ఖాన్, లక్మా, దీపక్ పాల్గొన్నారు.
ఉట్నూర్, మార్చి 16: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ కార్యాలయంలో సెర్ప్ ఉద్యోగులు సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, కామెరి పోశన్న, రామారావ్, రవి, భూమన్న, ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులు రాజేశ్వర్, పద్మారావు, రజిత, చంద్రకళ, సరస్వతి, స్వప్న, అరుణకుమారి, రాజేందర్, రాజరత్నం, నరేందర్, నర్సయ్య, దశరథ్, సూర్యకాంత్ పాల్గొన్నారు.
బజార్హత్నూర్, మార్చి16: స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్, సోన్న మల్లేశ్, షబ్బీర్, అక్షయ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, మార్చి16 : మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగురామన్న చిత్రపటాలకు ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో అడ్డి భోజారెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు అరిగెల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అశోక్, నర్సింగ్‌రావు, నేతలు జీవన్, సురేందర్ ఉన్నారు.
నేరడిగొండ, మార్చి 16 : ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు అడెల్లు, సర్దార్‌సింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లు గులాబ్, నర్సయ్య, రాజేశ్వర్, శేషరావ్, గంగాధర్, లత పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 16 : స్థానిక ఎంపీపీ కార్యాలయంలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఫ్లెక్సీలకు ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గాడ్గె సుభాష్, ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
నార్నూర్, మార్చి16: మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి అరికిల్ల బాపురావ్, ఫీల్డ్ అసిసెంట్లు, టీఆర్ఎస్ నాయకులు హైమద్, రాథోడ్ శివాజీ, కనక ప్రభాకర్, రాథోడ్ రమేశ్ ఉన్నారు.
నార్నూర్, మార్చి 16: గాదిగూడ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆడా చంద్రకళ రాజేశ్వర్, జడ్పీటీసీ మెస్రం గంగుబాయి సోము, సర్పంచ్ మెస్రం జైవంత్‌రావ్, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్యాంరావ్, గోపాల్, చంద్రహరి, వామన్, దత్తు, వసంత్, దాదిరావ్, ఆత్రం వామన్, చందు ఉన్నారు.