ఆదిలాబాద్ టౌన్, మార్చి 16 : మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవా రం సంబురాలు జరిపారు. ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు కాల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామ న్న ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ జహీర్ రంజానీ, మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు స్వరూప, మమత పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 16 : జిల్లా కేంద్రలోని డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో సెర్ప్ సిబ్బంది సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే శుద్ధోదన్ మాట్లాడారు. మహిళా సాధికారతపై సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత స్పష్టమైందన్నారు. మ రింత బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. జేఏసీ నాయ కులు బీ గంగన్న, ఏపీడీ చరణ్‌దాస్, డీపీఎంలు హేమలత,లత, సుగంధశేషారావు, సంతో ష్ , స్వామి, సీసీ అధ్యక్షుడు గంగన్న, శ్రీనివాస్, పద్మ, కిరణ్, కవిత, ఆఫీస్ సిబ్బంది ఉన్నారు.
నేరడిగొండ, మార్చి 16 : నేరడిగొండలోని భవిత మండల సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ ఉద్యోగులు సీఎంకేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీశ్ రావుకు సెర్ప్ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం సుదర్శన్, సెర్ప్ ఉద్యోగులు లింగరాజు, విద్యాసాగర్, విజయ, నహెద, కవిత, సరిత, పోసాని, సీబీవో ఆడిటర్ గంగాధర్ పాల్గొన్నారు.
సిరికొండ, మార్చి 16 : మండలంలోని ఐకేపీ, సెర్ప్ సిబ్బంది సీఎం కేసీఆర్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో సీసీలు లక్ష్మణ్,అనసూయ,రామారావ్, వీవోఏలు దత్తు, జంగు, గోవింద్, మంజులా దేవ్‌రావు పాల్గొన్నారు.
బోథ్, మార్చి 16: బోథ్‌లోని మండల మహి ళా సమాఖ్య కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఏపీఎం మాధవ్, సీసీలు గంగాధర్, సంజీవ్, లక్ష్మయ్య, గంగాధర్, మౌనిక, సుభద్ర, విజయలక్ష్మి పాల్గొన్నారు.
నార్నూర్,మార్చి 16 : మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ, సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీఎం మైస రమేశ్, సీసీలు కాంబ్లే సంతోష్, రాథోడ్ సంతోష్, జాదవ్ కిషన్, సత్యశీల, రేవయ్య, వీవోఏలు బాదిరావ్, దత్తారామ్ ఉన్నారు.