బోథ్, ఫిబ్రవరి 16: రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం ఆత్మ చైర్మన్ సుభాష్, డీ నారాయణరెడ్డి, అల్లకొండ ప్రశాంత్, రవీందర్‌యాదవ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
ఇచ్చోడ, ఫిబ్రవరి 16 : మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, నాయకులు దాసరి భాస్కర్, వెంకటేశ్, కళ్లెం సుభాష్ రెడ్డి, ఆర్గుల గణేశ్, ప్రవీణ్, గైక్వాడ్ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
పండ్లు పంపిణీ
భీంపూర్, ఫిబ్రవరి 16 : మండలంలోని బేల్సరిరాంపూర్ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు ఎంపీపీ రత్నప్రభ పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది విష్ణు, గంగాధర్, జ్ఞానేశ్వర్, జనాబాయి, సుజాత, ప్రియాంక, సర్పంచ్‌లు రూప, మడావి లింబాజీ, అనిల్, కృష్ణాయాదవ్, నాయకులు సంతోష్, రాథోడ్ ఉత్తమ్, జాదవ్ రవీందర్ పాల్గొన్నారు.
శివాలయంలో ఎమ్మెల్యే పూజలు
బోథ్, ఫిబ్రవరి 16: నిర్మల్ జిల్లా మామడ మండలం బుర్కపల్లి గ్రామంలోని శివాలయంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దంపతులు పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పరమేశ్వరుడిని వేడుకున్నారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆలయంలో అభిషేకం చేశారు.
బేల/జైనథ్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బేల, జైనథ్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, నాయకులు గణేశ్, పురుషోత్తం యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, దేవన్న, సంతోష్ బెదుడ్కర్ పాల్గొన్నారు.
రక్తదానం.. ప్రాణదానం
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 16 : రక్తదానం చేయడమంటే మరొకరి ప్రాణాలను కాపాడినట్లేనని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రిమ్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దీపక్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 16 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీలు శోభాబాయి, జైవంత్‌రావ్, ఉట్నూర్ వైస్‌ఎంపీపీ బాలాజీ, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ అమ్జద్, మాజీ జడ్పీటీసీ సంగీత, మాజీఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్‌లు గాంధారి, రాథోడ్ శారద, ఎంపీటీసీలు స్వర్ణలత, ఆశాబాయి, కోవ రాజేశ్వర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు హరిదాస్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి కనక హనుమంత్‌రావ్, నాయకులు మారుతి, షేక్ సుఫియాన్, వసంత్‌రావ్, బాబుముండే, నగేశ్, రాంనివాస్, రాందాస్, సాయినాథ్, సుంకట్రావ్, భీంరావ్, ఆత్రం ధర్ము, నవాబ్బేగ్, బాల్సింగ్ పాల్గొన్నారు.
సాయిలింగి వృద్ధాశ్రమంలో..
తలమడుగు, ఫిబ్రవరి 16 : మండల కేంద్రంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి, నాయకులు కిరణ్‌కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆశన్న యాదవ్, మగ్గిడి ప్రకాశ్, సునీత రెడ్డి, గంగారెడ్డి, పోతారెడ్డి, ప్రశాంత్, మల్లయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి జగదీశ్, వైస్‌ఎంపీపీ గండ్రత్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్ పాల్గొన్నారు.