ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్
శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
బేల, మార్చి 16 : దేశంలో ఎక్కడాలేని సం క్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావు త్ మనోహర్ అన్నారు. బేల సబ్ మార్కెట్ యార్డు లో బుధవారం మండల నాయకులతో కలిసి శనగ కొనుగోళ్లను ప్రా రంభించారు. మొ దటగా శనగలు తె చ్చిన రైతును శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో రైతులను రాజుగా చూడడానికి అవసరమైన అన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం తో పాటు 24 గంటల కరెంట్, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభు త్వం మద్దతు ధర ఇచ్చి శనగలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. క్లస్టర్వారీగా తేదీలు ఇచ్చామని, రైతులందరూ సహకరించి శనగలు అమ్ముకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు సతీశ్ పవార్, కళ్యం ప్రమోద్ రెడ్డి, జక్కల మధుకర్, జితేందర్, బాల్చందర్, తన్వీర్ఖాన్, మస్కే తేజ్రావ్, సంతోష్ బెదుడ్కర్, విఠల్ వారాడే, మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర పాల్గొన్నారు.