భైంసా, మార్చి 15 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మరో సబ్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నదని అడిషనల్ డీజీ అభిలాష బిస్తా అన్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో మీర్జాపూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న పోలీస్ బెటాలియన్ స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సబ్ బెటాలియన్ ను మంజూరు చేసిందన్నారు. 9 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇక్క డ నిత్యం ఆరు కంపెనీలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడేం జరిగినా క్షణా ల్లో సిబ్బంది రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ఆమె వెంట ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే, తహసీల్దార్ విశ్వంభర్, ఎస్బీ సీఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు.
యాపల్గూడ బెటాలియన్ సందర్శన
ఎదులాపురం, మార్చి 15: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రెండో బెటాలియన్ను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిలాష బిస్తా మంగళవారం సందర్శించారు. జిల్లాకు చేరుకున్న ఆమెకు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్లో కొత్తగా నిర్మించిన బీవోఏసీ ట్రాక్, పరేడ్ గ్రౌండ్ డయాస్, యూనిట్ క్యాంటీన్, ధోబీ ,బార్బర్ తదితర గదులను ప్రారంభించారు. బెటాలియన్ మైదానం లో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ఆర్ వే ణుగోపాల్, అడిషనల్ కమాండెంట్ ఎం జ యరాజు, అసిస్టెంట్ కమాండెంట్స్ ,రిజర్వ్ సీఐ, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.