బోథ్, మార్చి 15 : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో రాథోడ్ రాధ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఆమె వెంట ఈవో అంజయ్య, ప్రత్యేకాధికారి వనిత ఉన్నారు.
ఆశ్రమోన్నత పాఠశాల తనిఖీ
సిరికొండ, మార్చి 15 : మండలంలోని రాయిగూడ ఆశ్రమోన్నత పాఠశాలను ఎంపీడీవో సురేశ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, స్టోర్ రూంలోకి వెళ్లి సరుకుల నిల్వలను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంట గదిని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట వార్డెన్ కొండిబా, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు.
నార్నూర్, మార్చి 15 : మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాల, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఎంపీడీవో రమేశ్ తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గదులు, స్టోర్రూంలు, నీటి వసతిని ఆయన పరిశీలించారు. పలు అంశాలను కల్టెకర్కు నివేదిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీవో స్వప్నశీల, ప్రత్యేకాధికారి జాదవ్ కవిత, ప్రధానోపాధ్యాయుడు విఠల్ ఉన్నారు.