ఎదులాపురం,మార్చి14:ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదిలా బాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు పలు సమ స్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకు న్నా రని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులు పరిశీలించి, తమ పరిధిలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్ర మంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ సీఈవో గణపతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బోధనోపకరణాలతో మంచి ఫలితాలు
ఆదిలాబాద్ రూరల్, మార్చి 14: ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో బోధించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలుగు, ఉర్ధూ, గణిత బోధనోపకరణాల మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఛాత్రోపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలపై అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డారు. విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలంటే బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమం లో డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, సెక్టోరల్ అధికారి సుజాత్ఖాన్, అధ్యాపకులు సంతోష్ కుమార్, ప్రతాప్, రాజేశ్వర్ రెడ్డి, ఉమాకాంత్, స్వర్ణలత, రాజేశ్వర్ పాల్గొన్నారు.
1298పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం.
వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని 1298 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నదని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసుతల ఏర్పాటుకు మన ఊరు-మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమం నిర్వహించనుందన్నారు. ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యనందించేం దుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో ప్రణీత, అధికారులు పాల్గొన్నారు.