గడ్డెన్నవాగులో కాలు జారిపడి ఇద్దరు యువకుల మృతి
ప్రాజెక్టులోని జాలరుల వద్దకు వెళ్తుండగా ప్రమాదం
స్నేహితుడిని కాపాడబోయి నీటమునిగిన మరో మిత్రుడు
భైంసా పట్టణంలో విషాదఛాయలు
భైంసా, మార్చి, 14 : పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో కాలుజారి పడి సయ్యద్ సోహెల్ (21), సయ్యద్ ఫెరోజ్ (21) అనే ఇద్దరు యు వకులు మృతి చెం దారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కుంట ఏరి యా ప్రాంతానికి చెందిన ఆరుగురు స్నేహితులు సోమవారం మధ్యాహ్నం గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వెళ్లారు. అక్కడే జాలర్లు చేపలు పడుతుండగా చూ సేందుకు బండలపై నుంచి లోపలివైపు వెళ్తుండగా అసన్ అలీ కుమారుడు సయ్యద్ సోహెల్ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న కుంట ఏరియాకు చెందిన మస్తాన్ కుమారుడు సయ్యద్ ఫెరోజ్ మిత్రుడిని రక్షించే క్రమంలో ఆయన కూడా అదుపు తప్పి నీట ము నిగాడు. గమనించిన మిగితా నలుగురు కాపాడేందుకు ప్ర యత్నం చే యగా అది విఫలమైంది. యువకులు రక్షించండి అం టూ కేకలు వేయడం తో జాలర్లు, ఇతరులు వచ్చి యువకులిద్దరిని నీటి లో నుంచి బయటకు తీశారు. సయ్యద్ సోహెల్ అప్పటికే మృతి చెందగా, ఫెరోజ్ను దవాఖానకు తరలించగా మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.