ఎదులాపురం,మార్చి14:జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలపై జిల్లా కేంద్రంలోని ఏఆర్హెడ్క్వార్టర్స్లోని పోలీస్ సమావేశ మందిరంలో సోమవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. దర్యాప్తులో తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా సీసీకెమెరాల ఏర్పాటుకు ప్రతి ఓక్కరూ కృషి చేయాలని కోరారు. మండలం, జిల్లా హెడ్క్వార్టర్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, మండలం లో బ్యాంకులు వారి చుట్టుపక్కల ప్రాంతాలు పట్టణంలో నూతనంగా ఏన్పడిన షాపింగ్ మాల్స్ అన్నింటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు.అదే విధంగా ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా నడిపే వాహనాలు, బైక్‌లపై త్రిబుల్ రైడింగ్ చేసేవారిని తనిఖీ చేయాలన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా గుట్కా,మట్కా గంజాయి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేసి వాటిని రూపుమాపాలని సూచించారు. ఉట్నూర్‌లో రెండో ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, బీ వినోద్ కుమార్, హర్షవర్ధన్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, విజయ్ కుమార్, ఏవో యూ నుస్ అలీ, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, బీ పురుషోత్తం, కే.నరేశ్ కుమార్, జే కృష్ణమూర్తి, నైలు, గుణవంత్‌రావు, సీసీ దుర్గం శ్రీనివాస్, ఆర్ఐలు డీ వెంకటి, ఎం శ్రీపాల్, ఎస్ వంశీకృష్ణ, ఐటీ కోర్, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.