ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గురామన్న
ఆదిలాబాద్‌లో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాంసి, మార్చి 13 : రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆదివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు మొదట శనగలు తెచ్చిన రైతును శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులను రాజుగా చూడడానికి అవసరమైన అన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనున్నదని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం శనగలకు క్వింటాల్ రూ.5230 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్ఢి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మార్క్‌ఫెడ్ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులపై కేంద్రానిది కపట ప్రేమ
జైనథ్, మార్చి 13 : రైతులపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ ఒలకబోస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. జైనథ్‌లోని మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం 25శాతం మాత్రమే కొనులోలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్.లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పురుషోత్తం యాదవ్, నాయకులు ఊశన్న, పెందూర్ దేవన్న, ఏడీఏ పుల్లయ్య, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
ఎదులాపురం, మార్చి 13 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జాగృతి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌లో చలివేద్రం, రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. చిన్న పిల్లల వార్డుల్లో పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేందుకు కవిత చేసిన కృషి ఎంతో ఉందన్నారు. విదేశాల్లో సైతం మన సంస్కృతిని చాటారని గుర్తుచేశారు. జాగృతి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ముందుగా ఎమ్మెల్యే కేక్‌కట్ చేసి నాయకులకు తినిపించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జాగృతి అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ పాల్గొన్నారు.
ఐటీ హబ్ పనులు పరిశీలన
ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ హబ్ కళ మరికొద్ది రోజుల్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి ఐటీ హబ్ కార్యాలయ పనులను పరిశీలించారు. నూతనంగా చేరిన ఉద్యోగులను కలిసి వారికి కావలసిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ నియామకాలు పొందిన విద్యార్థులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కంపెనీ ప్రతినిధులు సంజు దేశ్‌పాండే, ఆకాశ్ దేశ్‌పాండే, పంకజ, పావని, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగు మహేందర్, సలీం, ఉదయ్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.