ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
జిల్లా కబడ్డీ సంఘం సర్వసభ్య సమావేశం
ఆదిలాబాద్ రూరల్, మార్చి 13 : జిల్లాలో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా కబడ్డీ సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో వచ్చే ఏడాది రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. కబడ్డీ సంఘానికి త్వరలో సింథటిక్ మ్యాట్లు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో క్రీడాకారుల శిక్షణకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. అంతకుముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు సాయితేజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊషిరెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా సంఘానికి చైర్మన్‌గా ఎమ్మెల్యే జోగు రామన్నను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కబడ్డీ సంఘం రాష్ట్ర కోశాధికారి బాబన్న, సంయుక్త కార్యదర్శి సాయిరెడ్డి, క్రీడామండలి అబ్జర్వర్ రవీందర్, ఒలింపిక్ సంఘం జిల్లా కోశాధికారి పార్థసారథి, కబడ్డీ సంఘం జగిత్యాల కార్యదర్శి తిరుపతి, ఆసిఫాబాద్ కార్యదర్శి ఉల్లాస్ పాల్గొన్నారు.
జిల్లా కబడ్డీ సంఘం కార్యవర్గం..
అధ్యక్షుడిగా సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా హరిచరణ్, కోశాధికారిగా అజయ్, గౌరవాధ్యక్షుడిగా మహేందర్ బాబు, ఉపాధ్యక్షులుగా పార్థసారథి, వెంకట రమణ, కేమ శ్రీకాంత్, సంతోష్, సందీప్‌రావ్, కార్యదర్శిగా మజర్, సంయుక్త కార్యదర్శులుగా రాంకుమార్, జే రవీందర్, శ్రీధర్, సాయి ప్రకాశ్, కార్యవర్గ సభ్యులుగా గణేశ్, నవీన్, వేణు, సాయిరాం, సోహెబ్, వివేక్, చిన్ను, అర్వింద్ ఎన్నికయ్యారు.
చలో ఢిల్లీ పోస్టర్ విడుదల
ఎదులాపురం, మార్చి 13 : కుమ్మరివాడలో ఎమ్మెల్యే జోగు రామన్న దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా చలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎస్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన హలో దివ్యాంగులు..చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎన్పీఆర్డీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొల్లమాంబ జీవిత చరిత్ర ఆదర్శం
ఆతుకూరి మొల్లమాంబ జీవిత చరిత్ర నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడలో నిర్వహించిన ఆతుకూరి మొల్లమాంబ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుమ్మరి కులస్తులు ఎదుర్కొంటున్న సమ్యస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చించి వారికి కావాల్సిన ముడిసరుకులు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కుండలు అమ్ముకునేందుకు ప్రత్యేక జంక్షన్ ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కుమ్మరి కాలనీలో రూ.2 కోట్లకు పైగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు చెప్పారు. బీసీ సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు వెచ్చించి పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం కుమ్మరి మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు పార్థసారథి, లక్ష్మణ్, కుమ్మరి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బేల, మార్చి 13: మండలంలోని డోప్టాల గ్రామ మాజీ సర్పంచ్ వైద్య కిషన్ తల్లి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, ఇంద్రశేఖర్, ప్రమోద్‌రెడ్డి, సతీశ్‌పవార్, తన్వీర్‌ఖాన్, సుదర్శన్ ఉన్నారు.