రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌లో మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
నిర్మల్ టౌన్, మార్చి 13 : రాష్ట్రంలోనే అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవి, రచయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రామాయణాన్ని తెలుగులోలోకి ఆనువాదం చేసిన కవయిత్రి మొల్లమాంబ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, వ్యాపారవేత్త మురళీధర్‌రెడ్డి, కుమ్మరి సంఘ రాష్ట్ర నాయకులు బుచ్చన్న, సురేశ్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్, సతీశ్ పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
మంత్రికి వినతుల వెల్లువ..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి వివిధ సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. తమ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసే విగ్రహాలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. జిల్లా కేంద్రంలో దళితుల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించినందుకు దళిత సంఘాల నాయకులు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు బొడ్డు లక్ష్మణ్, ప్రభాకర్ పాల్గొన్నారు.