తలమడుగు, మార్చి 12 : బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని కజ్జర్ల, సాయిలింగి గ్రామాల్లో ఎమ్మెల్యే బాపురావ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కజ్జర్లలోని రైతు వేదికలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నాయకులు ఆయనను శాలువాతో సన్మానించారు. గ్రామంలోని 40 మంది యువకులు రక్తదానం చేశారు. గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సాయిలింగిలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, నాయకులు కిరణ్ కుమార్, దేవారెడ్డి, అబ్దుల్లా, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, తోట ప్రమోద్, పాండు, దేవ్‌రావ్, మగ్గిడి ప్రకాశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ధన్నూర్(బీ) ఎంపీటీసీ నారాయణరెడ్డి, సర్పంచ్ గంగాధర్ ఆదిలాబాద్‌లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బోథ్ సీఐ నైలు, వివిధ గ్రామాల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని బుద్దికొండ మహాలక్ష్మీ ఆలయంలో ఎంపీపీ రాథోడ్ సజన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కేక్ కట్ చేశారు. అలాగే బోథ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణసింగ్, కొర్టికల్(బీ) సర్పంచ్ శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, సర్పంచ్‌లు గంగామణి, సుభాష్, రాజుయాదవ్, ఉపసర్పంచ్ జగదీశ్, ఎంపీటీసీ గంగమ్మ, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, గడ్డం భీంరెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.