సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ఖానాపూర్‌లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఖానాపూర్ టౌన్, మార్చి 8: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉందని రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖానాపూర్ మండలంలో మంజూరైన 109 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఏదో ఒకరకంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి కేక్‌కట్‌చేశారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మిని సన్మానించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ మోయిద్, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో వనజ, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా, మున్సిపల్, పారిశుధ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి కృషితోనే మెడికల్ కళాశాల ..
నిర్మల్ అర్బన్, మార్చి 8 : రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో పూల మొక్కను అందజేశారు. అనంతరం కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు మంత్రిని కలిసి పూలమొక్క అందజేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మైనార్టీ నాయకులు నజీరొద్దీన్, మహ్మద్ ఖాసీం, జాబీర్ ఖాన్ ఉన్నారు.
మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మికి మంత్రి నివాసంలో మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు పూలమొక్కను అందజేశారు. మంత్రితో పాటు ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము శుభాకాంక్షలు తెలిపారు.
మహిళల ఆత్మగౌరవం పెంచిన సర్కారు మనదే
నిర్మల్ టౌన్, మార్చి 8 : దేశ చరిత్రలోనే మహిళలకు సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో అమలు చేసి ఆత్మగౌరవం పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జనరంజక బడ్జెట్ నిధుల కేటాయింపు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు, గిరిజనులకు పోషకాహారం అందించేందుకు వరాలు కురిపించడంపై సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మొదటగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి రాఖీ కట్టారు. ప్రపంచ దేశాల్లో 700 కోట్ల జనాభా ఉంటే అందులో 360 కోట్ల మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు.
కలెక్టర్ ముషారఫ్ అలీ, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడారు. సంక్షేమ పథకాల పంపిణీతో పాటు ఉత్తమ మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. స్త్రీనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద 438 మంది లబ్ధిదారులకు రూ.4.39 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్డీవో రమేశ్‌రాథోడ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఓస రాజేశ్వర్, మున్సిపల్ చీఫ్ విప్ నేరేళ్ల వేణు, మహిళా కన్వీనర్ సోని, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు మోహినొద్దీన్, గంగారెడ్డి, వినోద్ పాల్గొన్నారు.
పాఠశాలలు బలోపేతం
కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని హరితవనంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. రాష్ట్రంలో బడుల బాగు కోసం రూ.7,289కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, పీఆర్టీయూ అధ్యక్షుడు నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి రమణారావు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.