ఆదిలాబాద్ రూరల్, మార్చి 8: ఆదిలాబాద్‌లోని న్యూహౌసింగ్ బోర్డుకు చెందిన వంశీకృష్ణ ఉక్రెయిన్ నుంచి వచ్చాడు. మంగళవారం ఆదిలాబాద్‌కు చేరుకున్న వంశీకృష్ణను ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు. అనంతరం అక్క డి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులందరినీ క్షేమంగా తీసుకు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జాదవ్ పవన్ నాయక్, శ్రీకాంత్, విజయ్రావ్, తిరుమలేశ్, రమేశ్, వినోద్ రెడ్డి పాల్గొన్నారు
జైనథ్, మార్చి8: మండలంలోని కాప్రి గ్రా మంలో క్రికెట్ పోటీల్లోని విజేతలకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న బహుమతులు అందజే శారు. అంతకుముందు ఎమ్మెల్యే మహంకాళి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కా ర్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి,ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్ , వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పురు షోత్తం యాదవ్ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, సర్పంచ్ ఎల్టీ రమీల వెంకట్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.