ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ మ ధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లా అధికారు లు, రైస్ మిల్లర్లతో మంగళవారం సమీక్షా స మావేశం నిర్వహించారు.
- మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
- అధికారులు, రైస్‌మిల్లర్లతో సమావేశం
హాజీపూర్, నవంబర్ 29 : ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ మ ధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లా అధికారు లు, రైస్ మిల్లర్లతో మంగళవారం సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ వరిధాన్యం నిర్ధేశిత లక్ష్యాల ను సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలన్నా రు. కమీషన్ పేరుతో తరుగు ఎక్కువగా నమో దు చేయడం, అన్లోడ్ చేయకపోవడంతో రై తులు ఇబ్బందులు పడుతున్నారని విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. ధాన్యం లారీల లోడ్, అన్‌లోడింగ్‌ను పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏజెన్సీలు కేటాయించిన ల క్ష్యాలకు అనుగుణంగా లారీలను నడిపించాలన్నారు. మిలర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను జనవరి 15 లోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించుకొని అమ లు చేయాలని సూచించారు. ధాన్యం సంచికి గాను 40 కి లోల 600 గ్రాముల బరువు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, రైస్ మిల్లర్లు ఇదే ప్రక్రి య కొనసాగించాలని ఆదేశించారు.
2022-2023 వానకాలానికి గాను జిల్లాలో 2 లక్షల 90 వేల ఎకరాల్లో వరి సాగయ్యిందని, జిల్లా గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సహకార శాఖల పరిధిలో 229 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నా రు. ఇప్పటి వరకు 581 మంది రైతుల నుంచి 4 ,336 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో 1,53,750 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 51 రైస్ మిల్లులున్నాయని, కొనుగోలు చేసిన 4,336 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 2,946 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు. ఇప్పటివరకు 42 మంది రైతుల ఖా తాల్లో రూ. 61 లక్షలను జమ చేశామన్నారు. మిగిలిన వారికి చెల్లింపులు చేయాలన్నారు. రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 6303928262ను ఏ ర్పాటు చేశామని, ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వర కు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో అధికారి శేషా ద్రి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మార్కెటింగ్ అధికారి జగానంద్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్మాస్ కాంతయ్య, డీసీఎంఎస్ చైర్మన్ లింగ య్య, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సంబంధిత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

