సీసీసీ నస్పూర్, నవంబర్ 25: నస్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. సంక్షేమాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్‌కుమార్, కౌన్సిలర్లు కెడిక ప్రకాశ్‌రెడ్డి, వంగ తిరుపతి, కుర్మిల్ల అన్నపూర్ణ, పంబాల గంగా, మాజీ సర్పంచ్ వేల్పుల రాజేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు రౌతు రజిత, యూత్ పట్టణ అధ్యక్షుడు చెల్ల విక్రం, నాయకులు అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, గర్శె భీమయ్య, కమలాకర్‌రావు, చిట్యాల అశోక్, పంబాల ఎర్రయ్య, మండల క్రాంతి, దగ్గుల మధు, తదితరులు పాల్గొన్నారు.
పాడిపశువుల సంరక్షణకు ప్రభుత్వం కృషి
పాడి పశువుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లిలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మందులను పంపిణీ చేశారు. రైతులకు పాడి పశువులతో పాటు యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, వైస్ చైర్మన్ గోపతి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సభ్యులు గర్శె భీమయ్య, తిరుపతి, సురేందర్, పీఏసీఎస్ సభ్యుడు ధర్ని మధు, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, సుర్మిళ్ల వేణు, పశు సంవర్ధక శాఖ జేడీ రమేశ్‌కుమార్, వైద్యులు సతీశ్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.