భక్త జన సందోహం
కుభీర్‌లోని శ్రీవిఠలేశ్వరుడి జాతర, సప్తమి వేడుకలు మంగళవారం ముగిశాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు
- విఠలేశ్వరుడి జాతరకు పోటెత్తిన భక్తులు
- ముగిసిన తాళ సప్తమి వేడుకలు
- పాండురంగడిని దర్శించుకున్నఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఏఎస్పీ కిరణ్‌ఖారే
- చివరి రోజు వేలాదిగా భక్తుల రాక
- భారీ బందోబస్తు
కుభీర్, నవంబర్ 22 : కుభీర్‌లోని శ్రీవిఠలేశ్వరుడి జాతర, సప్తమి వేడుకలు మంగళవారం ముగిశాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈనెల15న ప్రారంభమైన తాళ సప్తమి వేడుకలు మంగళవారం కాకడ హారతి, పల్లకీ ఊరేగింపు, అన్నదానంతో ముగిశాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు, ఆడపబిడ్డలు శనివారం ఉదయం నుంచే కుభీర్‌కు చేరుకున్నారు.
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్, ఏఎస్పీ కిరణ్‌ఖారే, సర్పంచ్ పానాజీ మీరా, ఎంపీపీ తూము లక్ష్మి, జడ్పీటీసీ అల్కాతాయి, మార్క్‌ఫెడ్ స్టేట్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో సహపంక్తి భోజనాలు చేశారు.
భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖారే, రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఎండీ షరీఫ్ బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నారా పరశురాం, కార్యదర్శి బచ్చు ప్రసాద్, మున్నూరుకాపు, యాదవ సంఘం అధ్యక్షులు బొప్ప మోనాజీ, కందూరి చిన్న సాయినాథ్, నాయకులు పానాజీ విజయ్‌కుమార్, బొయిడి విఠల్, వివేకానంద సిద్దం, ఎన్నీల అనిల్, గోనె కల్యాణ్, సూది రాజన్న, ఆర్యవైశ్య సంఘం నాయకులు రెడ్డిశెట్టి సంతోష్, ఆయా కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

