నిర్మల్ అర్బన్, నవంబర్ 22 : విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గ్లోబల్ ఎడ్యూకేషన్ సొసైటీ అధ్యక్షుడు అన్సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియం విద్యార్థులకు బీఎస్సీ, ఎంపీసీ కోర్సు లను ప్రవేశ పెట్టాలని మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు ల్లో ఉర్దూ మీడియం చదివే విద్యార్థులు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు.
డిగ్రీకి వచ్చే సరికి ఉరూమీడియంలో తగిన కోర్సులు లేకపోవడంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారని మంత్రి కి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి డిగ్రీలో ఉర్దూ మీడియం కోర్సుల ప్రవేశానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఖాజా యూసుఫ్ అహ్మద్, వసీం షకీల్, షేక్ నబీ, మహ్మద్ అబ్ధుల్ ముబిన్, అఫ్రోజ్ ఖాన్, మురాద్ బేగ్, షేక్ అమ్జద్ తదితరులు పాల్గొన్నారు.