అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లను చూసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
- ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
- మాండగాడలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరిక
జైనథ్, నవంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లను చూసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జైనథ్ మండలం మాండ గాడకు చెందిన నాయకులు అల్లూరి నారాయణ రెడ్డితో పాటు 100 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయ కులు, యువకులు ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోనే ఉత్తమ పాలన కొన సాగిస్తున్నారని, అన్నిరంగాల్లో మిగతా రాష్ర్టాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరా యడంతో పాటు అక్కడి ప్రభుత్వాలను కుల గొట్టడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు లో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేతలు సిట్ ముందు హాజరుకాకుండా తప్పించుకు తిరుగు తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని పేర్కొ న్నారు.
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, డీసీసీబీ డైరెక్టర్ బాలురి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రోకండ్ల రమేశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సర్పంచ్ సైపాల్ హిందు మహేందర్, నాయకులు ప్రభాకర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
బేల, నవంబర్ 22 : మొహబత్పూర్ గ్రామా నికి చెందిన గెడాం కిశోర్ మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డిభోజారెడ్డి, నాయకులు జక్కుల మధుకర్, విఫిన్ఖోడే ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

