భైంసా, నవంబర్ 19 : భైంసా ఏరియా దవాఖానకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. ఈ విషయమై వినతి పత్రం అందించారు. ఏరియా దవాఖానలో ప్రస్తుతం ఉన్న వంద పడకలకు అదనంగా మరో 50 పెంచాలని కోరారు. స్పందించిన మంత్రి.. నూతన భవన నిర్మాణానికి సంబంధించిన అంచనా వివరాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.