ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు భగ్గుమన్నాయి. మహిళల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడంపై మండిపడ్డారు. పల్లెలు, పట్టణాల్లో శనివారం ధర్మపురి దిష్టిబొమ్మలు దహనం చేశారు. భారీగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ‘బీజేపీ హఠావో.. తెలంగాణ బచావో.. అర్వింద్ డౌన్ డౌన్.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అర్వింద్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, పసుపు బోర్డు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ఆయన బోర్డు తెచ్చే సత్తాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్, కవితలపై నోరు జారితే సహించబోమని, ఖబడ్దార్ అని హెచ్చరించారు.
ఖానాపూర్ టౌన్, నవంబర్ 19 : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖబడ్దార్ అని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలను చేయడం హేయమని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఖానాపూర్లోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్యే రేఖానాయక్ మండల నాయకులతో కలిసి అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ దేశం, రాష్ట్రం కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. మహిళల మనోభావాలు, ఆత్యగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అనంతరం పాత బస్టాండ్ మీదుగా జగన్నాథ్చౌక్ వరకు భారీ ర్యాలీ తీశారు. ‘బీజేపీ హఠావో.. తెలంగాణ బచావో’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, పట్టణ, మండలాధ్యక్షులు పరిమి సురేశ్, రాజగంగన్న, కౌన్సిలర్లు సంతోష్, శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, నాయకులు శంకర్, రాజేశ్వర్, సతీశ్, శ్రావణ్, నగేశ్, కిశోర్, మల్లేశ్, మహేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కడెం, నవంబర్ 19: ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కడెం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘బీజేపీ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ అహ్మద్, నాయకులు జడ ఇందూర్నేత, కొండపురం లక్ష్మణ్, సురేందర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశ్, నాయకులు ఆజాం, పంజాల రామాగౌడ్, ముబారక్ బిన్ మహ్మద్, కే రవి, కరుణ, మల్లవ్వ, ఎండీ కలీం, షర్పొద్దీన్, పాకనాటి రాజేశ్వర్, సన్నీ, బత్తుల బాలు, కోల రాజేశ్వర్, చిటేటి ముత్తన్న, నేరేళ్ల నరేశ్, తిరుపతిరెడ్డి, కానగంటి మల్లేశ్, ఎండీ హసీబ్, అశోక్, గంగాధర్, అయా గ్రామాలకు చెందిన నాయకులు, తదితరులున్నారు.
దస్తురాబాద్,నవంబర్ 19 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎంపీపీ సింగరి కిషన్ అన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దస్తురాబాద్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజల చేతిలో అర్వింద్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు ముస్తాఫా, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, సర్పంచ్ అప్పని ప్రభాకర్, నాయకులు నిమ్మతోట శివయ్య, రాజనర్సయ్య, కమలాకర్ గౌడ్, రాజన్న, మల్లేశ్, రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 19 : ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెంబి మండల టీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశా రు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, ఎంపీటీసీ రామారావు, నాయకులు విలాస్, ఇస్మాయిల్, సుతారి మహేందర్, రాజేందర్, శేఖర్ పాల్గొన్నారు.
ఉట్నూర్, నవంబర్19 : ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, వైస్ ఎంపీపీ బాలాజీ అన్నారు. ఉట్నూర్ అంబేద్కర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కవితపై ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్ పసుపు రైతులను మోసంచేసి గెలిచిన సంగతిని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కోఆప్షన్ రషీద్, నాయకులు పోచన్న, నారాయణ, పెందూర్ కళావతి, అన్సారి, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 19 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మారుతిపటేల్ డోంగ్రే, శివాజీ, అమ్జద్, దేవ్‌పూజె మారుతి డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా మండలకేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోవ రాజేశ్వర్, పోటే సాయినాథ్, షేక్ సుఫియాన్, ఆరెల్లి రాందాస్, నగేశ్, బాబుముండే, శ్రీనివాస్, నవాబ్బేగ్, శ్యామ్కేంద్రే, బాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.