బాసర, మార్చి 10 : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించడంపై ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ట్రిపుల్ ఐటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి 14 ఏండ్లుగా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి 135 మంది కాంట్రాక్టు అధ్యాపకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దత్తు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అజయ్, కోశాధికారి కుమార్ రాగుల, డా. దేవరాజ్, డా. పావని, డా. వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మామడ, మార్చి 10 : మామడ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధ్యాపకులు సంజీవ్, సుధారాణి, లక్ష్మీకాంత్, నాగేశ్వర్రావు, సవీన్, పురుషోత్తం, సురేఖ, సుమన్గౌడ్, బేలయ్య, రజనీ పాల్గొన్నారు.