తాంసి, నవంబర్ 14 : పరస్పర సహకారంతోనే రైతుల అభివృద్ధి సాధ్యమని, అందుకు సహకార సంఘాలు చేయుతనందిస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. 69వ సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు ఆవరణలో సోమవారం ఆయన జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక బలోపేతం చేయడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్లు పురుషోత్తంయాదవ్, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాంసిలో..
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సీఈవో కేశవ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ వన్నెల నరేశ్, మాజీ ఎంపీటీసీ గంగారాం, డైరెక్టర్లు, కార్యదర్శులు గణేశ్, ఆశన్న, నాయకులు రామన్నయాదవ్, గజానన్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్ల పద్మాకర్ రెడ్డి, సీఈవో శ్రీనివాస్, సెక్రటరీలు గంగయ్య, భీంరావ్, సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.
జైనథ్ సహకార సంఘంలో చైర్మన్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈవో గంగన్న, సుశీల్, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే సహకార సంఘం అభివృద్ధి
సమష్టి కృషి గ్రామస్తుల సహకారంతోనే సహకార సంఘం అభివృద్ధి చెందుతుందని పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని కుమారి పీఏసీఎస్‌లో సహకార సంఘం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మందుల రమేశ్, సీఈవో ప్రవీణ్, డైరెక్టర్లు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 14: బోథ్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చైర్మన్ కదం ప్రశాంత్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీవో గోలి స్వామి, ప్రణీత్, ప్రవీణ్, అనిల్, దేవీదాస్, భూమేశ్ పాల్గొన్నారు.
రైతుల అభ్యున్నతికి కృషి
రైతుల అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కృషి చేస్తుందని పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్‌చైర్మన్ కుమ్ర కేశవ్‌రావ్, మాజీ చైర్మన్ దిలీప్మోరే, డైరెక్టర్లు చిక్రం భీంరావ్, నిద్యాన్సింగ్, మధుకర్, అధికారులు ధరమ్‌సింగ్, తుమ్మల సునీల్‌కుమార్, సురేశ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న ఏడు రంగుల జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో సీఈవో నారాయణగౌడ్, డైరెక్టర్లు చట్ల వినిల్, లింగన్న, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.