బాసర, నవంబర్ 11 : ప్రభుత్వం ద్వారా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ తెలిపారు. కళాశాలలో పీ యూసీ-1, 2 తరగతి గదులను, సీసీ కెమెరాల సెక్యూరిటీ ఆఫీస్‌ను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న పీయూసీ-1, 2 విధానాన్ని మార్చి ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. అలాగే మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ప్ర భుత్వం ద్వారా 2,200 ల్యాప్‌టాప్‌లను అందించేందుకు సిద్ధం చేశామని చెప్పారు. వెయ్యి కం ప్యూటర్లతో నూతన ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందు కు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామన్నారు.
పలు కొత్త కోర్సులను కూడా తీసుకువస్తామని వెల్లడించారు. తెలంగాణ స్టేట్ రెన్యూవబల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో హాస్టళ్లపై సోలార్‌ప్లాంట్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు వేడి నీటిని అందించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. పీయూసీ-1, 2 తరగతి గదులతో పాటు, సీసీ కెమెరాల నియంత్రణ కార్యాలయాన్ని పరిశీలించినట్లు, ఇతరులకు క్యాంపస్‌లోకి ప్రవేశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సె క్యూరిటీ విభాగానికి సూచనలు ఇస్తున్నామన్నా రు. డిసెంబర్ మొదటి వారంలో 5వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరూ సర్టిఫికెట్లు పొందేలా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా నో డ్యూ చెల్లించాలని సూచించారు.
నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాక..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి శనివారం ట్రిపుల్ ఐటీకి రానున్నట్లు ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ తెలిపారు. ‘ఇంజినీరింగ్ విద్యా నైపుణ్యం-భవిష్యత్’ అనే అంశంపై విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీశ్‌కుమార్‌తో పాటు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు.