ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
జైనథ్ కేజీబీవీలో సైన్స్ డే
మైసమ్మ ఆలయంలో పూజలు
జైనథ్, ఫిబ్రవరి 28 : విద్యార్థి దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో సోమవారం నిర్వహించిన సైన్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలను పరిశీలించారు. వాటి గుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతుతున్నదన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మైసమ్మ ఆలయంలో పూజలు..
మండల కేంద్రంలోని మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శివ లింగానికి, మైసమ్మ తల్లికి నూతనంగా మకర అలంకరణ చేశారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రణీత, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, నాయకులు పుండ్రు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, దేవన్న, తల్లెల చంద్రయ్య, సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, డీఎస్వో రఘురమణ, ఎంఈవో నారాయణ, ఎస్వో వీణాకుమార్, హెచ్ఎం లస్మన్న తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో టైలర్స్ డే..
ఎదులాపురం, ఫిబ్రవరి 28 : జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో మేరు సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే నిర్వహించారు. ముందుగా కుల గురువు సంత్ నాందేవ్ మహారాజ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూజలు చేసి, జెండా ఎగరేశారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నదని తెలిపారు. తాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 72 కులాలకు ఆత్మగౌరవ భవనాలు అందించినట్లు గుర్తుచేశారు. పట్టణంలో రూ.5కోట్లతో బీసీ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారథి, కార్యనిర్వాహక అధ్యక్షుడు దత్తు, మేరు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.