మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 28 : వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జీఎస్ ఎస్టేట్లో పట్టణ ప్రగతి నిధులు రూ.30లక్షలతో చేపట్టనున్న పార్కు, పలు అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అందుకు అణుగుణంగా పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సాయిప్రణయ్, వార్డు అధ్యక్షుడు రాజుశర్మ, మున్సిపల్ అధికారులు తిరుపతి, నర్సింగ్, ప్రభావతి పాల్గొన్నారు.
పేదల వద్దకే సంక్షేమ పథకాలు
పేదల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు తీసుకురావడం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ 18 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు బండారి సతీశ్, అజయ్, లక్ష్మణ్, శ్రీనివాస్, ప్రకాశ్, జాదవ్ పవన్నాయక్, హైమద్, సంతోష్ పాల్గొన్నారు.