ఎదులాపురం,ఫిబ్రవరి28: వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఈనెల 3న మంత్రి హరీష్‌రావు జిల్లాకు రానున్న నేపథ్యంలో వైద్యాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన పీహెచ్‌సీలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో శ్రీకాంత్, వివిధ ప్రోగ్రామ్‌ల ఆఫీసర్లు శ్రీధర్, నవ్య, సువిధ, క్రాంతికుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.