ఆదిలాబాద్, అక్టోబరు 28 (నమస్తే తెలంగాణ): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి వారికి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఏ ర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగుల పాలిట వరంగా మా రింది. విశాలమైన భవనం, తరగతి గదులు, లైబ్రరీ, విద్యార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఇక్కడ కల్పించారు. ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్న నిరుద్యోగులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమ్స్ ఫలితా ల్లో ఈ సర్కిల్ విద్యార్థులు సత్తా చాటారు. 375 మంది శిక్షణ తీసుకోగా 250 మంది కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు. ఇందులో 62 మంది రెండింటికీ ఎం పికయ్యారు. వీరికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలతో, మెయిన్స్‌కు శిక్షణ నవంబరు 2 నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించిన బీసీ స్టడీ సర్కిల్‌గా ఆదిలాబాద్ నిలిచింది.
బీసీ స్టడీ సర్కిల్‌తో పాటు బీసీ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చారు. గ్రూప్-1ప్రిలిమ్స్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌ను ఉ త్తమ స్టడీ సర్కిల్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా వారి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మం గళవారం, శుక్రవారం ప్రతి విద్యార్థికి రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉద్యోగాలపై అవగాహన, బుధవారం నిరుద్యోగులకు ఓరియంటేషన్, మొటివేషన్, కెరీర్ కౌన్సెలింగ్, గురువారం పోటీ పరీక్షల్లోని ఒక సబ్జెక్ట్‌పై అవగాహన కార్యక్రమం, శనివారం రాష్ట్రం, కేంద్ర ఉద్యోగాలు నోటిఫికేషన్లను తెలియజేయడం. ప్రతి నెలకు ఒకరోజు జాబ్‌మేళా ఏర్పాటు చేసి, కంపెనీల్లో ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రభుత్వ గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఈ ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడమే లక్ష్యం గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు వంద మందికి శిక్షణ ఇచ్చాం. కచ్చితంగా మం చి ఫలితాలు సాధిస్తాం. త్వరలో గ్రూప్-1 మెయిన్స్‌కు శిక్షణ ప్రారంభిస్తాం. గ్రూప్-2 కు కూడా శిక్షణ ఇవ్వనున్నాం. అర్హత సాధించిన వారు బీసీ స్టడీ సర్కిల్‌కు వచ్చి సంప్రదించాలి. గతంలో శిక్షణ తీసుకున్న వారికి నేరుగా అడ్మిషన్ ఉం టుంది. ఇతరులకు రిజర్వేషన్ ప్రకారం అవకాశం కల్పిస్తాం. స్టడీ సర్కిల్లో లైబ్రరీ, స్టడీ హాల్, అన్ని రకాల పోటీ పరీక్షలు పుస్తకాలు ఉన్నాయి. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు ఉపయోగించుకోవచ్చు. ఇతర వివరాలకు 08732-221280 నంబర్లో సంప్రదించాలి.
-జీ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్