చెన్నూర్ టౌన్/మంచిర్యాల ఏసీసీ/భైంసా, అక్టోబర్ 23 : దీపావళి అంటే దీ పాల వరుస.. ఆ దివిటీలు మ నలో నెలకొన్న చీకట్ల ను చీలుస్తాయి. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి. మన సంప్రదాయంలో దీపం దైవ స్వ రూపం. జ్ఞానానికి సంకేతం. ఆనందానికి ప్రతీక. అందుకే దీపాన్ని లక్ష్మీరూపంగా భావిస్తారు. పండుగను పురస్కరించుకొని మార్కెట్ల న్నీ కళకళలాడుతున్నాయి. పెద్ద ఎత్తున పటాకుల దుకాణాలు వెలిశాయి. ఊరూరా.. పండుగ సందడి నెలకొంది. సోమవా రం నరకచతుర్ధశి, దీపావళి, లక్ష్మీపూజలు నిర్వహించుకోవాలని, బుధవారం కేదారేశ్వర వ్ర తాలు నోముకోవాలని పండితులు సూచిస్తున్నారు.
సోమవారం దీపావళి..
దీపాల వెలుగుల్లో, రకరకాల పూల అలంకరణలో.. కొత్త బట్టలతో, విద్యుత్ దీప కాంతులతో ప్రతి ఇల్లూ శోభాయమానంగా వెలిగిపోతుంది. మన దేశంలో దీపావళి పండుగ గురించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఇతిహాసాలు, ఆసక్తికరమైన కారణాలు, రహస్యాలు, కథలు, నమ్మకాలు ఉన్నాయి. సత్యభామ నరకాసురున్ని సంహరించిందని, నరకాచతుర్ధశి నరకాసురుడి పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబురాలు జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతున్నది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి రోజు అమావాస్య కావడంతో చీకటిని పారదోలుతూ యేటా దీపాలతో తోరణాలు వెలిగిస్తారు. పటాకులు కాల్చి వేడుక చేసుకుంటారు. ఈ పండుగ యేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి. దీనినే నరక చతుర్ధశిగా నిర్వహిస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవి ప్రజల ఇళ్లను సందర్శించి వారిని ఆశీర్వదిస్తుందని పూర్వీకుల నమ్మకం. అందుకే చాలా మంది లక్ష్మీపూజల కోసం ఇంట్లోని పాత వస్తువులను తొలగించి శుభ్రం చేసుకుంటారు. ధనలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా దీపావళిని జరుపుకోవాలని హిందువులు నమ్ముతారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. కొంతమంది కేదారేశ్వర వ్రతాలు నోముకుంటారు. ఈ సోమవారమే నరకచతుర్ధశి, దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సోమవారం లక్ష్మీదేవి పూజలు, బుధవారం కేదారేశ్వర వ్రతాలు నోముకోవాలని చెబుతున్నారు. మంగళవారం సూర్యగ్రహణం నేపథ్యంలో నోములు, వ్రతాలు ఉండవని పేర్కొంటున్నారు.
సోమవారమే నరక చతుర్దశి.. దీపావళి
దీపం.. చీకటి నుంచి వెలుగుకు దారి చూపుతుం ది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజ లు దీపావళి పండుగను జరుపుకుంటా రు. ఈ యే డాది సోమవారమే నరక చతుర్ధశి, దీపావళి, లక్ష్మీపూజలు జరుపుకోవాలని శాస్త్రం చెబుతున్నది. లక్ష్మిని పూజించడంతో ఐష్టెశ్వర్యాలు కలుగుతాయి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటా రు. మంగళవారం సూర్యగ్రహణం ఉండడంతో కేదారేశ్వర వ్రతాలు బుధవారం జరుపుకోవాలి.
– వేమారపు మహేశ్వర శర్మ, అర్చకుడు, శివాలయం, చెన్నూర్